మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు... హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

charminar
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు జరుగనున్నాయి. స్థానిక ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్ బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి లేదా రవీంద్ర భారత్ వైపు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్ బాగ్ జేబీఆర్ విగ్రహం కూడలి వైపు అనుతించరు. గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు పంపిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి బషీర్ బాబు కూడలి వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్ నగర్ వైపు పంపిస్తారు. 
 
అలాగే, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా అటువైపు కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లోతుకుంట, టి జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్, టి జంక్షన్, తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్డు, సిటీఓ, ఎస్బీఐ జంక్షన్, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్ ల్యాండ్, మొనప్ప కూడలి, ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వద్ద, పంజాగుట్ట, ఎన్ఎఫ్‌సీఎల్ ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ నిలిపివేస్తారు.