మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (09:53 IST)

హైదరాబాద్ నగర రోడ్లపై సాధారణ ప్రజల తరహాలో సీఎం రేవంత్ కాన్వాయ్

cmrevanthreddy convoy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర రోడ్లపై సామాన్య ప్రజల తరహాలోనే ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి హాదాలో ఉన్నప్పటికీ తన కోసం భాగ్యనగరి వాసులను ట్రాఫిక్ ఆంక్షల పేరిట అసౌకర్యానికిగురి చేయొద్దంటూ ఆయన భద్రతా సిబ్బందిని హెచ్చరించారు. పైగా, తన కాన్వాయ్‌లోని వాహనాలు కూడా ఇతరు వాహనాలతో కలిసి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్లేలా ఆదేశించారు. 
 
తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నంకారాదని, దీనిని అధికమించేందుకు పరిష్కారాలు చూపాలంటూ వారం రోజుల క్రితం పోలీసు శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై కసరత్తు చేసిన అధికారులు అందుకు అనుగుణంగా ఆలోచన చేసి ఓ కార్యాచరణను అమలులోకి తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదారాబాద్‌లో బుధవారం ప్రయాణించింది. 
 
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణ పౌరుల మాదిరిగానే రెగ్యులర్ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ కాన్వాయ్‌ ప్రయాణించడం, ట్రాఫిక్స్ సిగ్నల్స్‌ను పాటిస్తూ కదిలి వెళ్లడం వీడియోలో కనిపించింది. పైగా, సైరన్ లేకుండా ఎక్కడా ట్రాఫిక్ ఆపకుండా ముందుకుసాగింది. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని హైదరాబాద్ నగర వాసులు స్వాగతిస్తూ అభినందిస్తున్నారు. పైగా, వీఐపీ కల్చర్‌కు దూరంగా రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని వారు కొనియాడుతున్నారు.