శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2023 (22:57 IST)

వండర్లా హైదరాబాద్ సంతోషకరమైన మెర్రీ క్రిస్మస్ మహోత్సవాలకి సిద్ధం

Wonderla Hyderabad
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ అయిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, సెలవుల సీజన్‌ను స్వాగతించడానికి సిద్ధమయింది. డిసెంబర్ 23, 2023 నుండి జనవరి 1, 2024 వరకు క్రిస్మస్ పండుగ వేడుకలను నిర్వహించడానికి వండర్లా హైదరాబాద్ పూర్తిగా సిద్ధమైంది. ఈ సంతోషకరమైన సంఘటన ఒక చిరస్మరణీయమైన, మాయాభరితమైన అనుభవం కోసం సమాజాన్ని ఒకచోట చేరుస్తుందని వాగ్దానం చేస్తోంది. క్రిస్మస్ బ్యాండ్ యొక్క మంత్రముగ్ధులను చేసే స్వరాలు వింటూ, లైవ్ షోలు, సరదా ఆటలు, ఫుడ్ ఫెస్ట్, ఉత్కంఠభరితమైన 48 రైడ్‌లతో పాటు మరెన్నో కార్యక్రమాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. శాంటా స్ట్రీట్‌లోని, ప్రత్యక్ష శాంటా కార్నివాల్ డ్యాన్స్‌ యొక్క విచిత్ర ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఇక్కడ పిల్లలు, పెద్దలు శాంతాక్లాజ్‌ను కలుసుకుని, పలకరించవచ్చు, 55 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టు కింద క్రిస్మస్ శుభాకాంక్షలని పంచుకోవచ్చు మరియు సీజన్‌లోని అద్భుతాలను బంధించవచ్చు.
 
క్రిస్మస్ కార్యక్రమంలో భాగంగా, సాధారణ పార్క్ సమయాలతో పాటు, ప్రత్యేక సాయంత్రం ప్రవేశాన్ని ప్రకటించింది. సాయంత్రపు ప్రవేశం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది, రాత్రి 7 గంటల వరకు రైడ్‌లు పనిచేస్తాయి. సాయంత్రపు వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి, థ్రిల్‌ను అనుభవించడానికి ఒక అవకాశం ఇస్తూ, ఇది సందర్శకులకు పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. ఇంకా, డిసెంబరు 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు ప్రతి రోజు జరిగే ఈవెంట్‌లో బాండిస్టిక్‌తో కూడిన ఉత్సాహకరమైన  లైవ్ బ్యాండ్ తో పాటుగా ప్రతి రోజు జరిగే డిజె విక్రాంత్, డిజె కిమ్, డిజె వ్వాన్ వంటి అద్భుతమైన DJ షోల  ద్వారా ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఆస్వాదించండి.
 
అదనంగా, వండర్లా హైదరాబాద్ డిసెంబర్ 30, శనివారం రోజున వారి హైదరాబాద్ పార్క్‌లో “డెసిబెల్” DJ నైట్‌ని నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్‌లో ఇటాలియన్ సంచలనం డిజె జియాన్ నోబిలీ ప్రదర్శన ఇవ్వనున్నారు.