1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:42 IST)

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు.. ఎప్పటి నుంచో తెలుసా?

schools
తెలంగాణలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ‌లోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26 వరకు సెలవులు ఇచ్చారు. డిసెంబర్ 26వ తేదీని రాష్ట్ర స‌ర్కార్ సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. 
 
ఏపీలోని స్కూళ్లకు డిసెంబరు 25, 26 తేదీల్లో సెలవు ఉండనుంది. కొన్ని చోట్ల డిసెంబరు 23న కూడా సెలవు ప్రకటించారు. 2024 న్యూ ఇయర్ సోమ‌వారం వ‌చ్చింది. దీంతో న్యూ ఇయర్‌కి వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం జ‌న‌వ‌రి 1వ తేదీ ఇచ్చిన సెల‌వును.. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ రెండో శ‌నివారం ప‌నిదినంగా ప్ర‌క‌టించింది. 
 
అలాగే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌వ‌రి 13వ తేదీన రెండో శ‌నివారం చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 14వ తేదీన భోగి పండ‌గ.. ఆదివారం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి పండ‌గ‌.. సాధార‌ణంగా సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 16వ తేదీన ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు.