1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (16:23 IST)

బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేసిన మంత్రి రోజా.. ట్రోల్స్ మొదలు

rk roja
2024 నూతన సంవత్సర వేడుకలను ఏపీ మంత్రి, సినీ నటి రోజా ఘనంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై ట్రోల్స్ మొదలయ్యాయి. 
 
మంత్రిగా ఉండి పబ్‌లో చిందులేమిటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.