బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 డిశెంబరు 2023 (16:19 IST)

కేసీఆర్ అభివృద్ధి చేస్తే ఎవరో వచ్చి ఏలేస్తున్నారు, మరి చంద్రబాబు డెవలప్ చేస్తే కేసీఆర్ ఏలేయలేదా?

Chandrababu
కేసీఆర్ ప్రభుత్వం పరాజయం పాలయ్యాక సోషల్ మీడియాలో ఆయనపై సానుభూతి పవనాలు ఎగసిపడుతున్నాయి. ఆయన నివాసం వుంటున్న ప్రాంతానికి ప్రజలు తరలివెళ్లి కేసీఆర్ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. స్వయంగా కేటీఆర్ అయితే... తాము వేసిన ఓట్లకు కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందా అని పలువురు సందేశాలు పెట్టి ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... హైదరాబాద్ నగరం తాలూకు నైట్ లుక్ వీడియోను పోస్ట్ చేస్తూ... నగరాన్ని కేసీఆర్ ఇంతగా అభివృద్ధి చేస్తే ఇపుడు ఎవరో వచ్చి ఎంజాయ్ చేయబోతున్నారంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది. మరొకరు దానికి రీ-ట్వీట్ చేస్తూ.. ఇదంతా కేసీఆర్ చేసింది కాదనీ, గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి అభివృద్ధికి పునాదిరాళ్లు వేస్తే ఆ రాళ్లపై రంగులు వేసుకుని మెరుగులు దిద్దారంటూ కామెంట్ చేసారు. చూడండి ఈ ట్వీట్లు.