బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (16:07 IST)

తెలంగాణ మంత్రులు... శాఖల కేటాయింపులు..

Revanth Reddy-Sridhar Babu
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మరో పది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం  చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లారు. ఆయనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అదేసమయంలో మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. 
 
తెలంగాణ మంత్రులు.. వారికి కేటాయించిన శాఖల వివరాలను పరిశీలిస్తే, 
 
మల్లు భట్టి విక్రమార్క... డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం మంత్రి
శ్రీధర్ బాబు - ఆర్థిక శాఖ
తుమ్మల నాగేశ్వర రావు  - రోడ్లు భవనాల శాఖ
జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహా - ఆరోగ్య శాఖ
పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమ శాఖ
సీతక్క - గిరిజన సంక్షేమ శాఖ
కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
కోటంరెడ్డి వెంకట రెడ్డి - పురపాలక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటి పారుదల శాఖ