శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (22:33 IST)

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసే తొలి సంతకం ఎక్కడంటే...

revanth reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాంపల్లికి చెందిన రజని అనే వికలాంగ యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై సంతకం చేస్తారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం కూడా అధికారులు పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఉద్యోగం నీకే ఇస్తామంటూ గత అక్టోబరు నెలలో రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పూజీ పూర్తి చేసినప్పటికీ ప్రైవేటు లేదా ప్రభుత్వం ఉద్యోగం రాలేదని రేవంత్ రెడ్డి వద్ద ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారని, వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమెకు రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డును రాసి ఇచ్చారు. సో... గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తారు. ఇందులోభాగంగా, రజనీకి రేవంత్ రెడ్డి ప్రమాణా స్వీకారోత్సవ ఆహ్వానం కూడా అధికారులు పంపించారు.