గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (19:43 IST)

ఇచ్చిన మాట నిలబెట్టిన రేవంతన్న.. రజనీకి ఉద్యోగంపై తొలి సంతకం..

Revanth Reddy
Revanth Reddy
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గురువారం జరుగనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై వుంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం తొలి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చే పత్రాలపై రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి హామీ పత్రం ఇచ్చారు. 
 
వివరాల్లోకి వెళితే.. నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజనీకి కాంగ్రెస్ సర్కారు మొదటి ఉద్యోగం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు స్వయంగా రజనీ పేరుతో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నింపారు. 
 
అంతేగాకుండా.. రజనీని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రావాలని కోరారు. ఇప్పటికే ఆమెకు ఆహ్వానం కూడా పంపారు. రజినీకి ఉద్యోగం ఇచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులకు రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.