మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2025 (12:30 IST)

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Naga Chaitanya and Shobhita Dhulipala in traditional attire
Naga Chaitanya and Shobhita Dhulipala in traditional attire
కథానాయకుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట దీపావళినాడు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దీపావళి అంటే ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటూ కాప్షన్ జోడించారు. వారి మొదటి దీపావళిని కలిసి స్టైల్, ఆనందంతో జరుపుకున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళ, గతేడాది అక్కినేని  నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత అటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఇటు పర్సనల్ లైఫ్‌ను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తుంది.
 
ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. దయ, ఆకర్షణ మరియు తిరస్కరించలేని కెమిస్ట్రీతో మెరిసే వేడుక గా వున్నా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లైనా తర్వాత మొదటి దీపావళిని అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో ఎంతో ఆనందంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ ఫొటోలను శోభిత.. సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మేజర్, గూఢాచారి సినిమాల్లో నటించిన శోభితా.. పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ నటించింది.