సంబంధిత వార్తలు
- తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 299 పాజిటివ్ కేసులు
- 24 గంటల్లో 15,144 కరోనా పాజిటివ్ కేసులు.. 181 మంది మృతి
- కోవిడ్ -19 : డాక్టర్ రెడ్డీస్ Sputnik Vకి డీసీజీఐ అనుమతి.. భారతీయులకు సురక్షితం
- దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం.. 24 గంటల్లో 15వేల కేసులు
- జర్మనీలో కరోనా వ్యాక్సిన్.. 4 రోజుల్లోనే పది మంది మృతి
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 13మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది.
ఇజ్రాయెల్ పరిశోధకులు కరోనాను నియంత్రించేందుకు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని తీసుకున్న తర్వాత కనీసం 13 మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయి. ఆ దేశ ఆరోగ్య శాఖే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
''వ్యాక్సిన్ తీసుకున్న 28 గంటల వరకూ నేను ముఖ పక్షవాతంతోనే ఉన్నా'' అని ఓ వ్యక్తి చెప్పగా.. ఆ తర్వాత కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గలేదు అని మరో వ్యక్తి వెల్లడించారు.
అంతకుముందు జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబర్ నుంచే వ్యాక్సినేషన్‌పై జర్మనీ విస్తృత ప్రచారం చేసింది.
