దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం.. 24 గంటల్లో 15వేల కేసులు

corona Virus
corona virus
సెల్వి|
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,11,033 కరోనా క్రియాశీల కేసులుండగా.. క్రియాశీల రేటు 2శాతానికి తగ్గింది. మరోవైపు వైరస్‌ కారణంగా నిన్న మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1,52,093 మంది కరోనాకు బలయ్యారు. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,57,65,491 మందికి టెస్టులు చేశారు.దీనిపై మరింత చదవండి :