శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (17:59 IST)

రుచికరమైన స్పైసీ పూరీ తయారీ విధానం..

Spicy Puri
అసలే చలికాలం.. కారంగా వేడి వేడిగా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేయాలని వుంటుంది. అలాంటి వారికి స్పైసీ పూరీ బాగా నచ్చేస్తుంది. మిరపపొడి, ఉప్పుతో లొట్టలేసుకుని తినే పూరీలను వండితే టేస్టు భలేగుంటుంది. ఈ పూరీలకు ఆలూ కర్రీ, చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్. అలాంటి రుచికరమైన స్పైసీ పూరీ తయారీ ఎలాగో చూద్దాం.. 
 
కావలసినవి: రెండు కప్పుల గోధుమ పిండి, ఒక టీస్పూన్ ఉప్పు, ఐదు టీస్పూన్ల పసుపు పొడి, ఒక టీస్పూన్ మిరప పొడి, ఒక టీస్పూన్ జీలకర్ర, నూనె తగినంత. కారం కోసం గరం మసాలాను కూడా అరస్పూన్ జత చేసుకోవచ్చు.
 
తయారీ విధానం: ఉప్పు, ఎర్ర కారం, పసుపు పొడి, జీలకర్ర, నూనె వేసి పిండిని నానబెట్టండి. సింపుల్ ప్యూరిస్ లాగా రోల్ చేసి బాగా కాగిన నూనెలో వేయించాలి. అంతే స్పైసీ పూరీ రెడీ. ఈ పూరీలు మూడు, నాలుగు రోజులైనా నిల్వ వుంటాయి.