శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (11:20 IST)

రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా చంద్రికాప‌ర్సాద్ సంటోఖి? ఎవరు ఈయన?

ఈ నెల 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ అధ్యక్షుడు బోరిన్ జాన్సన్ హాజరుకావాల్సివుంది. కానీ, బ్రిటన్‌లో స్ట్రెయిన్‌ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయన స్థానంలో రిప‌బ్లిక్ డే ముఖ్య అతిథిగా రిప‌బ్లిక్ ఆఫ్ సురినామ్ దేశ అధ్య‌క్షుడు చంద్రికాప‌ర్సాద్ సంటోఖి రానున్న‌ట్లు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. 
 
ఈయ‌న భార‌త సంత‌తి వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట‌ బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిచినా.. ఆ దేశంలో పెరిగిపోతున్న క‌రోనా కేసుల కార‌ణంగా తాను రాలేన‌ని ఆయ‌న చెప్పారు. దీంతో సురినామ్ దేశాధ్య‌క్షుడిని ఆహ్వానించారు. ఈ మ‌ధ్య జ‌రిగిన ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్‌కు కూడా సంటోఖియే ముఖ్య అతిథిగా వ‌చ్చారు. 
 
గ‌తేడాది జులైలో ఈయ‌న సురినామ్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న పార్టీ ప్రోగ్రెసివ్ రీఫార్మ్ పార్టీ 51 స్థానాల‌కుగాను 20 స్థానాల్లో గెలిచింది. సురినామ్ ద‌క్షిణ అమెరికా ఖండం ఈశాన్య మూల‌న ఉండే ఓ చిన్న దేశం. ఇది గ‌తంలో డ‌చ్ కాల‌నీగా ఉండేది. ఈ దేశ జ‌నాభా కేవ‌లం 5 ల‌క్ష‌ల 87 వేలు కాగా.. అందులో 27.4 శాతం మంది భార‌త సంత‌తి వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం.