సంబంధిత వార్తలు
- కోవాగ్జిన్‌కు పూర్తిస్థాయి లైసెన్స్ నిరాకరణ : డీసీజీఐ
- ప్రయాణికులకు శుభవార్త .. 24 రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
- Actress Vijayashanti birth day: బాలయ్యతో 17 చిత్రాలు.. రాములమ్మ సినీ ప్రస్థానం
- జూన్ 24న దేశంలో కరోనా పాజటివ్ కేసులెన్ని?
- పెరిగిసిన పసిడి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?
జూన్ 25 కరోనా బులిటెన్ : 51 వేల పాజిటివ్ కేసులు
దేశంలో జూన్ 25వ తేదీ శుక్రవారం కరోనా బులిటెన్ వెల్లడైంది. ఈ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అలాగే, 64,527 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇకపోతే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, గురువారం 1,329 మంది కరోనా బాధితులు చనిపోయారు.
దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, దేశంలో శుక్రవారం వరకు మొత్తం 39,95,68,448 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 24న 17,35,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
