1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (16:37 IST)

కోవాగ్జిన్‌కు పూర్తిస్థాయి లైసెన్స్ నిరాకరణ : డీసీజీఐ

హైదరాబాద్ కేంద్రం ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకాకు పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేసేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నిరాకరించింది. దీంతో కోవాగ్జిన్‌కు మరోమారు చుక్కెదురైనట్టయింది. 
 
బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నారు. ​తాజాగా 77.8 శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్‌ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తన డేటాను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. 
 
అయితే, మరింత క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా కావాలని భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్‌లైసెన్స్‌ పర్మిషన్‌ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కోవాగ్జిన్‌ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కాగా, అమెరికాలో కోవాగ్జిన్‌ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతి తెల్సిందే.