సంబంధిత వార్తలు
- కరోనాకు మందు కనిపెట్టిన సీఎం జగన్‌కు నోబెల్ ఇవ్వాలి : ధూలిపాళ్ళ నరేంద్ర
- కరోనా వైరస్ దాచిపెట్టినట్లు తేలితే 6 నెలలు జైలు శిక్ష, ఎక్కడ?
- #మహమ్మారి కరోనా అంటుకుందేమోనని కేంద్రమంత్రి ఇంట్లోనే స్వీయనిర్బంధం... ఎక్కడికెళ్లొచ్చారు?
- కరోనా దెబ్బకు కకావికలం : యూరప్‌లో ఫుట్‌బాల్ కోచ్ మృతి
- 24 గంటల్లో 14 వేల కరోనా వైరస్ కేసులు : డబ్ల్యూహెచ్ఓ
కరోనా-ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు.. దుప్పట్లు ఇచ్చేది లేదు..
కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. భారత్‌లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేశాయి. తాజాగా కరోనా నియంత్రణకు రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అంతేగాకుండా.. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నామని, వీటిలో ప్రయాణికులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది. వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయరని, అందుకే వీటిని తొలగిస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులు ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని కోరింది.
