1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Sonia Gandhi tests Corona positive, many leader-workers also got infected

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

sonia
దేశాన్ని కరోనా మహమ్మారి వీడట్లేదు. తగ్గిందనుకున్న కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల సైతం ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెతో కలిసి సమావేశాలకు హాజరైన నేతలతో పాటు, సన్నిహితులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
2022, జూన్ 02వ తేదీ గురువారం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారు. మరోవైపు... ఈనెల 08వ తేదీన ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది.
 
కానీ.. కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. 
About Writer
సెల్వి