1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. If not having IPL 2016 will solve drought problem, we should stop playing cricket, says Rahul Dravid

మ్యాచ్‌లను తరలిస్తే కరువుకు పరిష్కారమైతే.. క్రికెట్‌ ఆడటం ఆపేయండి: ద్రవిడ్

Rahul Dravid
మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మండిపడ్డారు. కేవలం నీటి సమస్య కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీలోపు జరిగే మ్యాచ్‌లను మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మిగిలిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించనున్నారు. 
 
దీనిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించారు. కరువుకు.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. 'నీళ్లు లేకుండా మనుషులు చనిపోతుండటం చాలా తీవ్రమైన సమస్య. అయితే ఈ సమస్యను ఐపీఎల్‌కు ముడిపెట్టడం వల్ల దాని తీవ్రత తగ్గిపోతుంది. ఐపీఎల్‌ లేకుంటే సమస్య పరిష్కారమైపోతుందా? అలాగైతే మొత్తంగా క్రికెట్‌ ఆడటాన్నే ఆపేయండి' అంటూ ద్రవిడ్ కాస్తంత కఠువుగానే స్పందించాడు. 
About Writer
pnr