1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Vaibhav Sooryavanshi Fights Back Tears In Dugout After RR's IPL 2026 Exit

ఐపీఎల్ 2026 : గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. బోరున విలిపించిన వైభవ్

vaibhav suryavanshi
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడంతో ఆ జట్టు చిచ్చరపిడుగు 15 యేళ్ల వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతమయ్యాడు. 
 
చండీగఢ్‌లోని జరిగిన ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ భారీ స్కోరు సాధించింది. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (53 బంతుల్లో 104 నాటౌట్), సాయి సుదర్శన్ (58) రాణించడంతో 18.4 ఓవర్లలోనే విజయం సాధించింది. 
 
అయితే, ఈ సీజన్ ఆసాంతం రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని తన లేత భుజాలపై మోసిన వైభవ్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్లో తలదించుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ.. డగౌట్లో కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు. కెమెరాలకు తన ముఖం కనిపించకుండా టవల్ అడ్డుపెట్టుకుని ఏడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో చేతులు కలిపే సమయంలోనూ అతను తీవ్ర నిరాశతో కనిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులో జట్టు గెలుపు కోసం అతడు చూపించిన కసి, ఆ తర్వాత కార్చిన కన్నీళ్లు అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల హృదయాలను ద్రవింపజేశాయి. జట్టు ఓడినా, అతని పోరాట స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ అనేకమంది సానుభూతి తెలిపారు.
 
ఈ సీజనులో 16 ఇన్నింగ్స్‌లో 776 పరుగులు చేసిన వైభవ్, 237కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 72 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అద్భుతాలు చేసి, వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతటి ప్రతిభావంతుడైన యువ ఆటగాడికి భవిష్యత్తు ఉందంటూ క్రీడా నిపుణులు, అభిమానులు ధైర్యం చెబుతున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ