1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Kavya Maran congratulates Vaibhav Sooryavanshi after Eliminator blitz

Kavya Maran: జట్టు ఓడిందని కావ్య కన్నీళ్లు.. అయినా వైభవ్ సూర్యవంశీకి అభినందనలు

Kavya Maran congratulates Vaibhav Sooryavanshi
Kavya Maran congratulates Vaibhav Sooryavanshi
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన కావ్య మారన్.. వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించింది. స్వయంగా వచ్చి కరచాలనం చేయడంతో వైభవ్ ఎంతో వినయంగా తలవంచి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
కావ్య మారన్ ఇలా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించడం చాలా అరుదు. దాంతో ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశమైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 
 
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు ఓటమిని తట్టుకోలేక ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Vaibhav Sooryavanshi: సెంచరీలు వస్తుంటాయ్.. కానీ ఐపీఎల్ ట్రోఫీపైనే దృష్టి: వైభవ్