1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Phillip Hughes funeral on December 3; Gabba Test delayed

డిసెంబర్ 3న ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు!

Phillip Hughes funeral on December 3; Gabba Test delayed
తలకు బౌన్సర్ తగిలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. స్వస్థలం మాక్స్ విల్లేలోని ఓ పాఠశాల మైదానంలో హ్యూస్‌ను ఖననం చేస్తారు. 
 
మాక్స్ విల్లే... సిడ్నీ, బ్రిస్బేన్ నగరాలకు మధ్యలో ఉంటుంది. హ్యూస్ అంత్యక్రియలకు క్రికెటర్లు హాజరవుతారని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. దీంతో, భారత్‌తో జరగాల్సిన తొలి టెస్టును వాయిదా వేసినట్టు తెలిపింది. 
 
వేగంగా వచ్చిన బౌన్సర్ బంతి హ్యూస్ తలకి అరుదైన ప్రదేశంలో తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు భావించారు. అయితే, అది తీవ్రమైన ఒత్తిడికి గురై, నలిగిపోయిందని ఫలితంగా తుది శ్వాస విడిచినట్టు తెలిపారు. 
About Writer
PNR