1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. andhra pradesh : brutal murder in vinukonda

కుటుంబ కలహాలు : బావమరిదిని హత్య చేసిన బావ

murder
ఏపీలోని వినుకొండ, శృంగారపువనంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా బావమరిదిని బావ కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... శృంగారపువనానికి చెందిన రాచకూటి షారోన్‌ (25) చెల్లెలు హెమీమీని ఆరేళ్ల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన చిలకా గోపితో వివాహం జరిపించారు. వారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 
 
అయితే, గోపి చెడు వ్యసనాలకు అలవాటై తరచూ వేధిస్తున్నాడని హెమీమీ అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేది. గతంలో పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపించారు. రెండు మూడు రోజుల తర్వాత గోపి మళ్లీ వేధించసాగాడు. దీంతో హెమీమీ మళ్ళీ పుట్టింటికి వచ్చింది. దీంతో గోపిపై హేమీమీ అన్న షారోన్ కోపం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో బుధవారం గోపి, షారోన్‌ కలిసి మద్యం సేవించారు. మత్తులో ఇద్దరూ గొడవ పడ్డారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గోపి చిన్న గ్యాస్‌ సిలెండర్‌తో షారోన్‌ తలపై కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే