సంబంధిత వార్తలు
- నీతో మాట్లాడాలి అంటూ యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన యువకుడు, మృతి
- హోటల్లో మహిళా షూటర్‌పై అత్యాచారం.. గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది..
- మరదలితో వివాహేతర సంబంధం, అందుకే భార్యను ముక్కలు చేసి చంపిన గురుమూర్తి
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా గెలిచిన గిరిజన మహిళ.. వెట్టి చాకిరీ చేస్తూ..?
- దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్
రైలులో మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారం.. జవాను అరెస్టు
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో దారుణం జరిగింది. రైలులో ఓ మహిళా ప్రయాణికురాలిపై జవాను లైంగికదాడికి పాల్పడ్డాడు. రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన రక్షక భటుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన టాటీసిల్వాయి రైల్వే స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 22 యేళ్ల యువతి రాంచీ వెళ్లేందుకు రైలు కోసం స్టేషనులో వేచివుండగా, అదే సమయంలో డిఫెన్స్ లాజిస్టిక్ రైలుకు భద్రతా విధుల్లో ఉన్న ఓ సైనికుడు ఆమెను ఓ ఖాళీ రైలు బోగీలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు కేకలు వేయడంతో స్టేషన్‌లోని ఇతర ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌కు చెందినవాడని, పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు.
