సంబంధిత వార్తలు
- ఉజ్జయినిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్ అరెస్టు
- మహిళను లోబరుచుకున్నాడు.. అడ్డు చెప్పిన భర్తను చంపేశాడు.. వాలంటీర్ ఘాతుకం
- పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టే కుక్కలు వైకాపా నేతలు : నారా లోకేశ్ ఫైర్
- పందికి పాండ్స్ వాసన తెలుస్తుదా? వైకాపా నేతలూ అంతే : నారా లోకేశ్
- వేటకొడవలితో ఆటోడ్రైవర్‌పై దాడి.. భార్యతో సన్నిహితంగా వున్నాడని?
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?
ఏపీలోని కృష్ణా జిల్లాలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. ఇది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 యేళ్ల బాలిక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళేందుకు బస్టాండులో నిరీక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుంపటి చందు (22), అతని స్నేహితుడు 17తో కలిసి గ్రామానికి వెళుతున్నారు.
బస్టాండులో బాలికను చూడటంతో తనను కూడా ఇంటివద్ద దింపాలని ఆ బాలిక కోరింది. దీంతో సరేనని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. రొయ్యూరుకు తీసుకెళ్ళారు. అక్కడ చందు మద్యం సేవించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు... చందుతో అతనికి సహకరించిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం
