గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (12:58 IST)

పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టే కుక్కలు వైకాపా నేతలు : నారా లోకేశ్ ఫైర్

nara lokesh
ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహించిన కుక్కలు కృష్ణా జిల్లా వైకాపా నేతలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా, మంగళవారం రాత్రి గన్నవరం వేదికగా యువగళం బహిరంగ సభ జరిగింది. ఇందులో లోకేశ్ వాడివేడిగా ప్రసంగించారు. వైకాపా నేతల పరువు తీసిపారేశాడు. కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నేతలను కుక్కలతో పోల్చారు. 
 
కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పిరికి సన్నాసులు అని విమర్శించారు. 'ఇతర జిల్లాల్లో వైసీపీ కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తర్వాత మొరిగేవి. కృష్ణా జిల్లా వైసీపీ కుక్కలు నేను జిల్లాలో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నాయి' అంటూ ఎద్దేవా చేశారు. "లోకేశ్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి అని వైసీపీ కుక్కలు మొరిగాయి. అమ్మలాంటి అమరావతిని చంపేసిన ఈ కుక్కలకు నన్ను ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పుట్టిన గడ్డకి జగన్ అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన కుక్కలు మనకి నీతులు చెబుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు.. పాఠశాలలకు సెలవు రద్దు  
 
తెలంగాణ విద్యా శాఖ వెనక్కి తగ్గింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులకు చూపించాలని భావించి, అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేసింది. కానీ, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీనికి కారణాలను కూడా వివరించింది. బుధవారం పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది.
 
కాగా, చంద్రయాన్-3‌ ప్రయోగంలో భాగంగా, చంద్రుడి దక్షిణ ధృవాన్ని అధ్యయనం చేసే ల్యాండర్ విక్రమ్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై కాలుమోపనుంది. ఇస్రో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
 
అయితే, జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయానికి, స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి మధ్య భారీ తేడా ఉండడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సాధారణంగా పాఠశాలలు 4.30 గంటలకే ముగుస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను 6.30 గంటల వరకు స్కూళ్లలోనే ఉంచడం సరికాదని, దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తొలుత జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. కావాలంటే గురువారం మధ్యాహ్నం యూట్యూబ్ ద్వారా చంద్రయాన్ ల్యాండింగ్ను చూపించవచ్చని తెలిపింది.