శుక్రవారం, 4 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జులై 2025 (17:23 IST)

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్. జ్యోతి కృష్ణ దర్శకుడు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 24వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని తొలి భాగం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను (Hari Hara Veera Mallu trailer) చూసి అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.
 
"హరి హర వీరమల్లు' ట్రైలర్‌ ఎంతో ఉత్తేజంగా ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత కల్యాణ్‌బాబు నుంచి వస్తున్న ఈ మూవీకి కచ్చితంగా థియేటర్లు దద్దరిల్లిపోతాయి. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌' అని పేర్కొన్నారు. 'ఈ ట్రైలర్‌ మూవీ ఎంత అద్భుతంగా ఉండబోతోందో చూపించింది. వెండితెరపై వినోదాన్ని పవన్‌కల్యాణ్‌ మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు' అని రామ్‌చరణ్ పోస్ట్‌ చేశారు.
 
ట్రైలర్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌పెట్టిన చిరు, రామ్‌చరణ్‌లకు చిత్ర బృందం థ్యాంక్స్‌ చెప్పింది. ‘మెగా విషెస్‌’కు ధన్యవాదాలంటూ పేర్కొంది. ఈ మూవీలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్‌, సత్యరాజ్‌, విక్రమ్‌ జీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ధర్మం కోసం యుద్ధం అంటూ  ‘హరి హర వీరమల్లు : స్వోర్డ్‌ అండ్‌ స్పిరిట్‌’ ఈ నెల 24న విడుదల కానుంది. మరి సెకండ్‌ పార్ట్‌ గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.