సంబంధిత వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... రూ.300 కోట్ల ఆస్తి నష్టం
- విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
- గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)
- నన్ను ప్రేమిస్తావా లేదా?: ఇనుప రాడ్డుతో యువతిపై ప్రేమోన్మాది దాడి
- విశాఖలో అరుదైన నాగుపాము... పడగ మాత్రం బంగారు వర్ణం
విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...
విశాఖపట్టణంలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిపై సహచర విద్యార్థితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మధురవాడలోని ఎన్సీపీలా కాలేజీలో బాధితురాలు మూడో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహంచేసింది. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించన వంశీ... గత ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత అదే నెల 13వ తేదీన డాబా గార్డెన్స్‌లో తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోమారు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్‌లు కూడా ఆమెపై లైంగికదాడికి తెగబడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించి, ఆ తర్వాత ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.
రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్‌లు బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా తన స్నేహితుల కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఆమె సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.ే
