సంబంధిత వార్తలు
- ఉప్పల్‌లో కొత్త కస్టమర్ హబ్ ప్రారంభంతో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించిన కార్స్24
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు
- T-Series నోటీసులపై SPIRIT IS NOT ONE చిత్ర నిర్మాతల ఆగ్రహం
- అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్.. హైదరాబాద్ క్రాఫ్ట్ చాక్లెట్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు
- NTR Clarity: ఎన్.టి.ఆర్.పై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ కార్యాలయం వివరణ
ఆఫీస్ భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
తాను పని చేస్తున్న భవనంపై నుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం, బెంగళూరుకు చెందిన తిరువీధి వి.అవినాశ్ (40) ఉద్యోగరీత్యా రెండు నెలల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు.
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కార్యాలయం నుంచి బయలు దేరుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇంటికి రాకపోవడంతో కార్యాలయంలో వాకబు చేయగా వెళ్లిపోయినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన బంధువు... కార్యాలయం వెనుకకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో శవమై కనిపించారు.
విధులు ముగిశాక నాలుగో అంతస్తులోని ప్లే ఏరియా నుంచి కిందికి దూకినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. ఇటీవల సైబర్ నేరగాళ్ల కారణంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నారని.. దాంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
