1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. tamil nadu : New bride died suspicious manner

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

tamil nadu
తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నెలకే నవ వధువు ఓ గుట్టపై నుంచి కిందపడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు.. గత నెలలో సురేశ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన భర్త ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం తెల్లవారుజామున దంపతులు కళుగుమలైలోని ఓ ఆలయానికి వెళ్లారు. 
 
పూజ అనంతరం కొండపై ఉన్న కోతులకు అనిత అరటి పండ్లు పెడుతుండగా ఆ గుంపు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టింది. భయాందోళనకు గురైన యువతి అక్కడి నుంచి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు కొండపై నుంచి కిందపడింది. 
 
దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. కట్టుకున్న భార్య కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె భర్త షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 
 
ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర, పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక సియా గోయల్‌ తన ప్రియుడు చేతన్‌తో కలిసి ఈ దారుణానికి పథకం రచించినట్లు తెలుస్తోంది. 
 
ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి, వారిని బాధపెట్టి వివాహం రద్దు చేసుకోవడం కంటే కేతన్‌ను చంపేయడమే సులభమని తాను భావించినట్లు విచారణలో సియా అంగీకరించినట్లు సమాచారం. పుణె రూరల్‌ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. 
 
మరోవైపు, ఈ కేసు విచారణకు పుణె, లోనావాలా పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సియా గోయల్‌ తల్లిదండ్రులను లోనావాలా సిటీ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ చేయగా.. ఆమె సోదరుడు సాహిల్‌ను పోలీసులు రెండోసారి విచారిస్తున్నారు. శుక్రవారం దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సియా సోదరుడు సాహిల్‌ పోలీసులకు కీలక విషయాలను వెల్లడించాడు. చేతన్‌ చౌదరి తనకు తెలుసని, తన సోదరి అతడిని ఓ క్రికెట్‌ మ్యాచ్‌లో పరిచయం చేసిందని పోలీసులకు తెలిపాడు.
 
అలాగే, గతేడాది ఓ కామన్‌ ఫ్రెండ్‌ నిర్వహించిన దీపావళి పార్టీలో కలిశాక వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. చేతన్‌, సియాల కాల్‌ రికార్డులను పరిశీలించగా.. జనవరి నుంచి వీరిద్దరూ 2వేల సార్లు దాదాపు 238గంటల పాటు సంభాషించుకున్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో కుట్ర కోణాన్ని రుజువు చేసేందుకు వీలుగా నిందితులు తమ మొబైల్‌ ఫోన్‌ల నుంచి డిలీట్‌ చేసిన డేటాను తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు