1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Vellore cyber police arrest man for obscene messages

మహిళా టీచర్‌ను బెదిరించి ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి బెదిరించిన వ్యక్తి...

arrest
మహిళా టీచర్‌ను బెదిరించి అశ్లీలంగా ఫోటోలు, వీడియో తీసిన వ్యక్తిన వేలూరు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వేలూరుకు చెందిన 41 యేళ్ళ ఓ మహిళ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె కొన్ని నెలల క్రితం ఓ ఫోన్‌ నంబరుతో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో లాగిన్‌ అయ్యారు. వాటిల్లో తన ఫొటోలు, బంధువుల ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. తర్వాత సదరు సిమ్‌కార్డును ఉపయోగించలేదు. దీంతో టెలికాం సంస్థ ఆ నంబరును మరొకరికి కేటాయించింది. 
 
ఇదిలావుండగా, సదరు మహిళ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు అశ్లీలంగా ఆమె వాట్సాప్‌కు వచ్చాయి. దీంతో ఆమె తాను గతంలో ఉపయోగించిన ఫోన్‌ నంబరుకు కాల్‌ చేశారు. అవతలి వైపు మాట్లాడిన వ్యక్తి.. అశ్లీల ఫొటోలు పంపకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని బెదిరించాడు. 
 
దీంతో ఉపాధ్యాయిని వేలూర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి తేని జిల్లా వెంకటాచలపురానికి చెందిన వంట మాస్టర్‌ జ్యోతి వెంకటేశన్‌(39)ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇక అయ్యప్ప ప్రసాదం నేరుగా ఇంటికే..