1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
  4. Tall Women Dresses,

హైట్‌గా ఉండే స్త్రీలు ఎలాంటి డ్రెస్సులు వేయాలంటే....!

Tall Women
మహిళలు వారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఇట్టే ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలు పార్టీకి వెళ్లినప్పుడు స్ప్రింగ్‌తో తయారైన దుస్తులు బాగా అబ్బుతాయి. అలాగే లిటిల్ బ్లాక్ డ్రెస్‌లు వేయవచ్చు. 
 
అయితే పొడవాటి డ్రెస్సులను వేయకూడదు. స్కట్స్ లాంటివి వేయడం ద్వారా మీ ఎత్తు పెద్దగా తెలియదు. అలాగే చీరల సంగతి కొస్తే అడ్డుగీతలతో కూడినవి వాడవచ్చు. రంగుల ఎంపికలోనూ ఎత్తుగా ఉండేవారు మైల్డ్ కలర్స్ ఎంచుకోవడం బెటర్. 
 
సింథటిక్ శారీస్ కట్టేటప్పుడు హ్యాండిల్ వర్క్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ వర్క్ శారీస్, ఫ్రేమ్, మిరర్ వర్క్, మందపాటి చీరలు కట్టడం ద్వారా ఎత్తుగా ఉండేవారు తమ డ్రెస్సింగ్ విధానం అందరినీ ఆకట్టుకుంటుందని డిజైనర్లు అంటున్నారు. 
About Writer
PNR