1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Actor Ajith thanks CM Vijay for motorsports push, calls it giant leap for India

సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన అజిత్ - ఎందుకో తెలుసా?

ajith kumar
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కోలీవుడ్ అగ్రహీరో, రేసర్ అజిత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అజిత్ ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధాని చెన్నై నగరంలో అధునాతన ఒలింపిక్ సిటీతో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనన్నట్టు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అజిత్ కుమార్ స్పందిస్తూ, సీఎం విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. 
 
ఇదే విషయంపై అజిత్ కుమార్ తన ఎక్స్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. 'నేను మోటార్‌ స్పోర్ట్స్‌లో చురుగ్గా పాల్గొంటాను. ఈ సందర్భంగా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చెప్పిన ఒక కొటేషన్‌ను మార్చి చెప్పాలనుకుంటున్నా. 'తమిళనాడు ప్రభుత్వం వేసిన ఈ ఒక్క చిన్న అడుగు.. భారత మోటార్‌స్పోర్ట్స్ రంగానికి ఒక పెద్ద ముందడుగు'. ముఖ్యమంత్రి విజయ్‌ చేపట్టే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా క్రీడా రంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలన్నీ గొప్ప విజయం సాధించాలి' అని అజిత్‌ పేర్కొన్నారు.
 
ఈ ఒలింపిక్‌ సిటీ గురించి విజయ్‌ గురువారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఒలింపిక్ సిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు, అత్యాధునిక శిక్షణ పరికరాలు, హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నేపాల్ వరదలు.. సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా...