1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Thimmaraju Palli gave me immense satisfaction as a TV film producer — Kiran Abbavaram

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Sai Tej, Veda, Kiran Abbavaram, V. Muniraju
Sai Tej, Veda, Kiran Abbavaram, V. Muniraju
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. తాజాగా ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
 
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - నా సక్సెస్, ఫెయిల్యూర్స్ లో ఆహా తోడుగా ఉంది. ఆహాలో నా సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. రామ్ గారు, అరవింద్ గారు కిరణ్ సినిమా అంటే నమ్మకంతో తీసుకుంటారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్రీనివాస్ గారు నాతో ఒక సోదరుడిలా ఉంటారు. సినిమాల గురించి చర్చించుకుంటాం. నా మూవీస్ గురించి కనుక్కుంటారు. నేను నా సినిమాలు ఆహాలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో తెలుసుకుంటాను. తిమ్మరాజు పల్లి టీవీ సినిమా విషయంలో సంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి కాంపాక్ట్ బడ్జెట్ లో మేము అఛీవ్ మెంట్ చేశాం. అది మా మూవీ టీమ్ వల్లే సాధ్యమైంది. వీళ్లందరి సపోర్ట్ వల్లే ఇంత మంచి క్వాలిటీ సినిమా చేయగలిగాం. కిరణ్ కొత్త వాళ్లతో సినిమా చేశాడని..మీడియా మిత్రులు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే సరిచేసుకుంటాం. మాతో అసోసియేట్ అయిన సుమైర స్టూడియోస్ తేజ వేల్పుచర్లకు థ్యాంక్స్. నెలరోజుల్లోనే మా టీమ్ అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి ప్రతిభ గల వారికి అవకాశాలు దక్కాలనే మేము ఈ ప్రయత్నం చేశాం. వంశీకాంత్ రేఖన మ్యూజిక్ మా చిత్రానికి బ్యాక్ బోన్ అయ్యింది. "తిమ్మరాజుపల్లి టీవీ" ఒక మంచి సినిమా అనే ఇంప్రెషన్ ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉంది. వాళ్లంతా ఆహాలో మా మూవీ చూస్తారని ఆశిస్తున్నా. మంచి నోస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే చిత్రమిది. తప్పకుండా ఆహాలో రేపటి నుంచి మా మూవీ చూడండి. నేను ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ కంప్లీట్ చేశాం, గువ్వలచెరువుఘాట్ షూటింగ్ చివరి దశలో ఉంది. నా డైరెక్షన్ లో చేస్తున్న సినిమా గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తా. అన్నారు.
 
ఆహా నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ - ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా కోసం ఫస్ట్ టైమ్ కిరణ్ గారితో మాట్లాడాను. అప్పటి నుంచి వారితో మా ఆహా జర్నీ కంటిన్యూ అవుతోంది. సమ్మతమే, రూల్స్ రంజన్, కె ర్యాంప్..ఇలా ఆయన సినిమాలన్నీ మా ఆహాలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాను ఆహా సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నేను పర్సనల్ గా ఈ సినిమా చూస్తూ బాగా కనెక్ట్ అయ్యాను. ఆహా ద్వారా మరింతమంది ప్రేక్షకులకు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ - ఈ సినిమా టైమ్ లో ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నాను. ఈ సినిమాకు మ్యూజిక్ అందించే సమయంలో కిరణ్ గారు, డైరెక్టర్ మునిరాజు ఎంతో సపోర్ట్, ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నేను అని గర్వంగా చెప్పుకుంటాను. అన్నారు.
 
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ - ఈ సినిమాతో మేము ఎలాంటి విజయాన్ని ఆశించామో, ఎలాంటి రెస్పాన్స్ ఆశించామో అది దక్కింది. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాను ఆదరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆహాలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రాన్ని చూసి,  బాగుందని చెప్పి సీఎం చంద్రబాబు గారి దగ్గరకు నన్ను మా వాళ్లు తీసుకెళ్లారు. ఈ చిత్రంలో నటించిన వారికి, సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు దక్కింది. అన్నారు.
About Writer
దేవీ