1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Severe Heatwave Alert for 62 Mandals in Andhra Pradesh

62 మండలాల్లో తీవ్ర వడగాలులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక

Summer
Heatwave Alert
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక ప్రకారం, శుక్రవారం నాడు 62 మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మరో 89 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండవచ్చు. గురువారం నాడు 26 జిల్లాలు, 382 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. ఇటువంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో కడపలో 45.1 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో 45.1 డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు, విజయనగరం జిల్లాలోని రాజంలో 44.5 డిగ్రీలు, కాకినాడ జిల్లాలోని కరపలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ.. 3 వారాల పొడిగింపు