1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Sabarimala Gold Case: Former TDB President Prasanth Gets Medical Bail

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

Sabarimala
శబరిమల అయ్యప్ప ఆలయం నుండి బంగారం మాయమైనట్లు ఆరోపణలు వచ్చిన కేసులో అరెస్టయిన మాజీ టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్‌కు, కొల్లం విజిలెన్స్ కోర్టు గురువారం నాడు అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కొల్లం విజిలెన్స్ కోర్టు న్యాయమూర్తి మోహిత్ సి.ఎస్., ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు టీడీబీ మాజీ అధ్యక్షుడైన ప్రశాంత్‌కు బెయిల్ ఇచ్చారు. గత నెలలో మెదడులో రక్తస్రావం కారణంగా ప్రశాంత్‌ను జైలు నుండి తిరువనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
అంతకుముందు కోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన ప్రశాంత్ తరఫు న్యాయవాది, అతనికి మెరుగైన వైద్య చికిత్స అవసరమని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అతని వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. 
 
శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం మాయమైనట్లు ఆరోపణలు ఉన్న కేసులో ప్రశాంత్ 17వ నిందితుడిగా ఉన్నారు. 2023-25 ​​కాలంలో టీడీబీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రశాంత్‌ను, జూలై 23న ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. సీపీఐ (ఎం)తో చేరడానికి ముందు ఆయన కాంగ్రెస్‌లో ఉండేవారు. 
 
సిట్ దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రకారం, శబరిమలలోని ద్వారపాలక శిల్ప ప్యానెళ్ల నిర్వహణ పనులను చేపట్టేందుకు ప్రశాంత్, టీడీబీ సభ్యులైన అజికుమార్, జి. సుందరేసన్ 2024లో ఒక బోర్డు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అయితే, మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ సమీపిస్తుండటంతో ఆ ఏడాది ఆ పనులను చేపట్టడం సాధ్యం కాలేదు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్