1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The \Mr. Work-from-Home team is publicizing Prime Minister Modi's words

Modi: ప్రధాని మోదీ మాటలను ప్రచారం చేసుకుంటున్న మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్

Trigun, Ramdas, Payal Radhakrishna
Trigun, Ramdas, Payal Radhakrishna
ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని చెప్పడం మా సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్‌టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్ పేర్కొన్నారు.
 
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
 
 హీరో త్రిగుణ్ మాట్లాడుతూ, చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అనీష్ కురువిల్లా గారు, సుదర్శన్ గారు, వైవా హర్ష ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. మొన్ననే ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
 
డిస్ట్రిబ్యూటర్ రాందాస్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందులో చిన్న సినిమా అంటే ఇంకా రిస్క్ ఉంటుంది. అయితే ఈ సినిమా మాత్రం చాలా నచ్చింది. ప్రొడక్ట్ చాలా క్వాలిటీతో తీశారు. మోదీజీ గారు కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహించారు. ఆయన మాట ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. యువత అందరూ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం. మే 15న అందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
సూర్య నిర్మాతకు ఆర్థిక కష్టాలు.. విడుదలకు నోచుకోని 'కరుప్పు'