1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shivrajkumar and Divyendu Sharma's Ferocious Looks from Peddi Released

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Shiva Rajkumar, Divyendu Sharma
Shiva Rajkumar, Divyendu Sharma
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు.
 
ఇదిలా వుండగా, ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్ర 'రామ్ బుజ్జి'ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. క్రికెట్ మైదానంలో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ యాటిట్యూడ్ పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా చూపించాయి.
 
మరోవైపు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర  గౌర్నాయుడుగా పరిచయం చేస్తూ పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శివరాజ్ కుమార్ కుస్తీ బరిలో పవర్ ఫుల్ ప్రెజెన్స్ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత పవర్ ల్ గా ఉండబోతుందో ఈ వీడియో తెలియజేస్తోంది.
 
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
About Writer
దేవీ