1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Woman gang-raped by colleagues at east Delhi cafe; three arrested

యువతిపై సామూహిక అత్యాచారం... ముగ్గురి సహోద్యోగుల అరెస్టు

victim
దేశ రాజధాని ఢిల్లీలో మరోదారుణం జరిగింది. ఓ కేఫ్‌లో పని చేస్తున్న సహోద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఢిల్లీలోని ఓ కేఫ్‌లో పని చేస్తున్న 8 మంది ఉద్యోగులు సోమవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఒక ఉద్యోగి వద్ద తాళాలు ఉండటంతో కేఫ్ మూసివేసిన తర్వాత తిరిగి దానిని తెరిచి అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. ఆ సమంయలో ఇద్దరు సహోద్యోగులు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడరని, వారికి మిగిలినవారు సహకరించారని ఓ యువతి ఆరోపించింది.
 
మంగళవారం తెల్లవారుజామున బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. 
 
పార్టీ అనంతరం తన స్నేహితుడు, ఇద్దరు మహిళతో కలిసి బాధితురాలు కేఫ్ నుంచి బయటకు వెళ్లినట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో రికార్డు అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. సహోద్యోగులే నిందితులు.. మద్యం తాగుతూ..?