శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2016 (12:23 IST)

అల్పాహారంలో ఓట్ మిల్క్‌, కోడిగుడ్డు, బ్రెడ్ ముక్కలుండేలా చూసుకోండి..

ఉదయం అల్పాహారం తీసుకుంటుంటే శరీరంలో మెటబాలిక్ స్థాయి పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను అల్పాహారం మానకండి. అల్పాహారంలో పండ్లు, బ్రెడ్ ముక్కలు తీసుకోవచ్చు. వీటితోపాటు ఓట్ మిల్క్ తీసుకోవడం కూడా ఆరోగ్యాన

ఉదయం అల్పాహారం తీసుకుంటుంటే శరీరంలో మెటబాలిక్ స్థాయి పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను అల్పాహారం మానకండి. అల్పాహారంలో పండ్లు, బ్రెడ్ ముక్కలు తీసుకోవచ్చు. వీటితోపాటు ఓట్ మిల్క్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. ఉడకబెట్టిన కోడిగుడ్డును ఉదయంపూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
అల్పాహారంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటుంటే శరీరానికి పుష్టికరమైన ఆహారం లభిస్తుంది. కాబట్టి ఉదయంపూట ఎట్టి పరిస్థితుల్లోను అల్పాహారాన్ని తీసుకోకుండా ఉండకండి.

ముఖ్యంగా పండ్లను తీసుకుంటుంటే శరీరానికి మంచి శక్తినిస్తాయి. కాబట్టి ఉదయంపూట పండ్లను ఆహారంగా తీసుకునేందుకు ప్రయత్నించండి. పుష్టికరమైన ఆహారం తీసుకోవడానికి కాస్తంత ప్లానింగ్ అవసరం. ప్రతి రోజూ ఉదయంపూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.