1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. buttermilk is great for your health

వరిపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే..?

ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీ

remedies
ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీర్చడానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. వరిపిండిలో పెరుగు కలిపి ఆ ముద్దని ముఖానికి, మెడకి, ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత స్నానం చేయడం మంచిది. దీనివల్ల చర్మం బాగా శుభ్రపడుతుంది.
 
బాదం నూనె, పన్నీరు, ఒక చెంచా మజ్జిగ కలిపి ముఖానికి, మెడకి, శరీరానికి స్నానం ముందు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. రెండు చెంచాల ఈస్ట్‌ను రెండు చెంచాల పెరుగుతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
 
మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతమవుతుంది. మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరంకావడంతో పాటు మృదువైన, ప్రకాశమైన  చర్మాన్ని పొందవచ్చు. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. 
About Writer
chitra
తర్వాతి కథనం
రాత్రి 8 గంటలకు నిద్రపోయే పిల్లలు.. ఉదయం 6 గంటలకు లేచే పిల్లలకు తేడా ఏంటి?