1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Exercise tips

అందంగా కనబడాలా.. వ్యాయామానికి సమయం లేదా.. గుంజీలు తీయండి..!

అందంగా కనబడాలా.. వ్యాయామం చేయాల్సిందే. తీసుకున్న ఆహారానికి తగినంత శారీరక శ్రమ లేకపోతే శరీరంలో అనవసర వ్యర్థాలు పేరుకుని ఊబకాయం వేధిస్తుంది. సమయం లేకపోయినా వ్యాయామానికి తక్కువ సమయంలో వ్యాయామాలు చేయాలి.

Exercise tips
అందంగా కనబడాలా.. వ్యాయామం చేయాల్సిందే. తీసుకున్న ఆహారానికి తగినంత శారీరక శ్రమ లేకపోతే శరీరంలో అనవసర వ్యర్థాలు పేరుకుని ఊబకాయం వేధిస్తుంది. సమయం లేకపోయినా వ్యాయామానికి తక్కువ సమయంలో వ్యాయామాలు చేయాలి. అంటే.. పుష్‌-అప్స్‌, గుంజీలూ, డంబెల్స్‌తో చేసే వ్యాయమాలు.. ఇలా ఏవైనా సరే ప్రయత్నించండి. రోజూ 50 గుంజీలు తీస్తే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. 
 
* చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ ఓ పద్ధతి, సమయం లేకుండా చేయడం వల్ల మీ లక్ష్యం దెబ్బతింటుంది. వీలైనంతవరకూ వ్యాయామ సమయం ఉదయమే ఉండేలా చూసుకోండి. దీనివల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.. క్రమం తప్పకుండానూ చేయగలుగుతారు.
 
* ఒంటరిగా వ్యాయామం చేయడం వల్ల చాలామంది కొద్దిరోజులకే వాటిని మానేస్తుంటారు. నడిచేప్పుడు ఇంటి వరండా, డాబాపైనో కాకుండా దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్లండి. ఈ సారి వర్కవుట్లు చేసేటప్పుడు మీరొక్కరే కాకుండా మీ స్నేహితురాల్నీ జతచేసుకోండి. వ్యాయామం కాస్త ఆటవిడుపునిచ్చేవిగా ఎంచుకుంటే మరీ మంచిది. అప్పుడప్పుడూ సరదా ఆటల్నీ మీ వ్యాయామ ప్రణాళికలో భాగం చేసుకోండి
 
* మీకు ఇదివరకే వ్యాయామం చేసే అలవాటున్నా ఎప్పుడూ ఒకే తరహావి వ్యాయమాలు ఎంచుకోవద్దు. ఎప్పటికప్పుడు కొత్తవాటిని ప్రయత్నించాలి. ఉదాహరణకు ఓ రోజు వేగవంతమైన నడక, ఇంకోరోజు ఈత, మరో రోజు సైకిల్‌ తొక్కడం ఇలాగన్నమాట. ఎప్పటికప్పుడు కొత్తవాటిని ప్రయత్నించడం వల్ల మీకు విసుగేరాదు.
About Writer
Selvi
తర్వాతి కథనం
బొప్పాయి ఆకుల‌తో డెంగ్యూకు చెక్... ఇంకా ఎన్నో ఉపయోగాలు...