1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Afternoon naps linked to premature death, research suggests

మధ్యాహ్నం పూట మొద్దు నిద్ర వద్దు.. 30 నిమిషాలే ముద్దు.. 40 నిమిషాలు దాటితే?!

మధ్యాహ్నం పూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే ఆ అలవాటును మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం పూట అలసటగా ఉంటే అరగంట పాటు కునుకు తీస్తే సరిపోతుంది కానీ గంటల కొద్దీ కునుకు తీయడం ద్వారా అ

Afternoon naps linked to premature death
మధ్యాహ్నం పూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే ఆ అలవాటును మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం పూట అలసటగా ఉంటే అరగంట పాటు కునుకు తీస్తే సరిపోతుంది కానీ గంటల కొద్దీ కునుకు తీయడం ద్వారా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట 40 నిమిషాలకు పైగా నిద్రపోతే ఒబిసిటీ, గుండెజబ్బులు, హైబీపీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
మధ్యాహ్నం పూట మొద్దుగా నిద్రపోయే వారిలో మెటబాలిజం సిండ్రోమ్‌కు దారితీసే అవకాశాలు 50 శాతం వరకూ ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతే కాకుండా వీరి జీవక్రియల్లో చాలా మార్పులు సంభవిస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యమే. కానీ పగటి పూట అతి నిద్ర వద్దే వద్దని, రాత్రిపూట 8 గంటల నిద్ర అవసరమని.. గంటపాటు వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా చిన్న వయస్సులోనే మృతిని కొనితెచ్చుకున్నట్లవుతుంది. సో.. మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు మాత్రం నిద్రపోకండి సుమా..! 
About Writer
Selvi
తర్వాతి కథనం
మహిళల్లోనే నిద్రలేమి సమస్య ఎక్కువ.. పురుషులు హాయిగానే నిద్రపోతారట..!?