1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Hot water lemon health benefits

బరువు తగ్గాలంటే.. నిమ్మరసం.. గోరువెచ్చని నీరు చాలు

నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగ

Hot water
నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగుపడి ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది. 
 
రోజు వారిగా నిమ్మ‌ర‌సం తాగితే కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తి  పెరుగుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుంచి బయటపడవచ్చు. గొంతునొప్పి, ఆస్తా ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మలోని సిట్రిక్‌యాసిడ్‌తో జీర్ణశక్తి చురుకవుతుంది. పంటినొప్పికి చక్కటి విరుగుడుగా నిమ్మరసం పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తుంది. నేత్ర సమస్యలను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
About Writer
selvi
తర్వాతి కథనం
వేపాకు చెట్టు కింద హాయిగా పగటిపూట కునుకు తీస్తే?