1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. How garlic removes the warts

పులిపిర్లతో బాధపడుతున్నారా... వెల్లుల్లి తీసుకుంటే...

పులిపిర్లు అనేవి చాలా సాధారణమైన సమస్యలు. జనాభాలో చాలా మందికి చర్మంపైన పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు ఏర్పడడానికి హెచ్‌పిబి వైరస్ కారణం. ఈ వైరస్‌లో 80 ఉపతరగతులు ఉంటాయి. వీటిలో చాలా అరుదుగా కొన్ని క్

garlic
పులిపిర్లు అనేవి చాలా సాధారణమైన సమస్యలు. జనాభాలో చాలా మందికి చర్మంపైన పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు ఏర్పడడానికి హెచ్‌పిబి వైరస్ కారణం. ఈ వైరస్‌లో 80 ఉపతరగతులు ఉంటాయి. వీటిలో చాలా అరుదుగా కొన్ని క్యాన్సర్‌ వ్యాధికి దారి తీస్తాయి. హెచ్‌పిబి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీర కణజాలంలో కొన్ని మార్పులు జరిగి చర్మంపై భాగానా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. దీన్నే మనం పులిపిరి అంటాం.
 
పులిపిర్ల వలన నొప్పి ఉండదు. కొన్ని పులిపిర్లు వంశపారపర్యంగా కూడా సంక్రమిస్తాయి. వాటిలో కొన్ని వాటంతట అవే కనిపించకుండా పోతాయి. వెల్లుల్లి రెక్కలను పులిపిర్లపై రుద్దితే తగ్గుతాయి. ఇలా రెండుమూడు వారాల పాటు చేయాలి. అలాగే ఒక డ్రాప్ ఆముదాన్ని పులిపిర్లపై వేసి స్టిక్కర్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలు, మూడు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సున్నం కూడా బాగా పనిచేస్తుంది. సున్నం పక్కన చర్మానికి పడకుండా చూసుకోవాలి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
తిన్నది అరగటం లేదు... పైగా గ్యాస్ ప్రాబ్లం.. ఏం చేయాలి?