1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Must-eat amla during this monsoon season, you know why?

ఉసిరిని ఈ కాలంలో తప్పక తినాలి, ఎందుకో తెలుసా? (video)

Must-eat amla during this monsoon season
ఈ కాలంలో విటమిన్ సి ప్రాధాన్యం ఎక్కువయింది. ఈ విటమిన్ సరిపడినంత వుంటేనే ఆరోగ్యపరంగా, ముఖ్యమంగా కంటిచూపు సమస్య వుండదు. ఇంకా జలుబు తదితర సమస్యలను తగ్గించే గుణం వుంటుంది. ఈ విటమిన్ పుష్కలంగా వున్నవాటిలో ఉసిరిక ఒకటి.
 
గొంతునొప్పి, జలుబు: విటమిన్ సి గొప్ప మూలం ఉసిరిలో వుంది. 2 టీస్పూన్ల ఆమ్లా పౌడర్‌ను 2 టీస్పూన్ల తేనెతో కలపండి. ప్రభావవంతమైన ఫలితాల కోసం రోజుకు మూడు, నాలుగుసార్లు తీసుకోండి.
 
మలబద్దకాన్ని తగ్గిస్తుంది: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, మలబద్ధకం సమస్యలను ఉసిరిక అరికడుతుంది.
 
నోటి పూత: ద్రవ రూపంలో తీసుకుంటే, ఉసిరి నోటి పూతలను కూడా నయం చేస్తుంది. ఆమ్లా రసాన్ని అర కప్పు నీటిలో కరిగించండి, పుక్కిలించండి. సమస్య తగ్గుతుంది.
 
బరువు తగ్గడానికి: బరువును తగ్గించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తున్నారా? మీ ఆహారంలో ఉసిరికను చేర్చడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. వేగంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా బరువు అదుపులో వుంటుంది.

 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మహిళలు ముక్కుపుడక కుట్టించుకుంటే ఇన్ని ప్రయోజనాలా?