ఈ చిన్న కిటుకుతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్
మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు మెంతుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే మెంతులను ఔషధంగా చెపుతారు.
కిడ్నీలో రాళ్లు: మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి ఉంచుకుని రోజుకి రెండుపూటలా పూటకి 50 మిల్లీ లీటర్లు ముల్లంగిరసంలో 2-3 గ్రాముల చూర్ణాన్ని కలిపి సేవిస్తూ వుంటే మూత్రపిండాలు-కిడ్నీల్లో, మూత్రనాళాలు మొదలైన మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.
మధుమేహం నియంత్రించేందుకు.. రోజూ రాత్రిపూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల మెంతులు వేసి నానించి ఉదయం పరగడపున నానిన మెంతులను నమిలి మింగి మిగిలిన నీరు తాగాలి.
నోట్లో పుళ్లు వుంటే.. రాత్రి పూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 నుంచి 15 గ్రాముల మెంతులను వేసి ఉదయం నీటిని వడగట్టి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది.