సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (21:08 IST)

కిడ్నీలు ఇలా కాపాడుకోవచ్చు

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదులక్షలమంది ప్రజలు కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలిన అంశం. 30 నుంచి 50వయస్సు వారే ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఆహారంతో కొన్ని మర్పులు, చేర్పులు చేసుకుంటే చాలంటున్నారు వైద్య నిపుణులు.
 
యానిమల్ ప్రొటీన్సు వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మాంసాన్ని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం పదిరెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అతిగా మాంసమంటే ఇష్టపడేవారు మితంగా మాత్రమే తినాలని సూచిస్తున్నారు.
 
పళ్ళ రసాలు తీసుకుంటూ రోజూ మొత్తం మీద కనీసం రెండున్నర లీటరు నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గించుకోవచ్చునని కూడా నిఫుణులు చెబుతున్నారు. పాప్ కార్నరల్ తింటూ కోకోకోలాలు తాగడం ఓ ఫ్యాషన్ గా మారిన ఈ రోజుల్లో కోలా డ్రింకులు కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తున్నాయని అంటున్నారు.
 
శాస్త్రవేత్తలు, పళ్ళ రసాల్లో ముఖ్యంగా ద్రాక్షరసం మానేస్తే మంచిదంటున్నారు. కాఫీలు, టీలు తాగే వారు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల్ని మించి తాగినా మంచిది కాదంటున్నారు. నిమ్మరసం ఇంట్లో అప్పటికప్పుడే తయారు చేసుకుని తాగాలట. బయట జ్యూసులు తాగడం అంత మంచిది కాదంటున్నారు. 
 
శరీరానికి పొటాషియం అవశ్యకత ఉన్న ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు. మెగ్నీషియం, మినరల్సును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలట. మన ఆహారంలో ఉప్పు శాతాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో తెలుసుకుని వైద్యులు సలహా పాటించాలట. వీలైనంత మన ఆహారంతో ఉప్పు, క్యాల్షియం తగ్గించాలంటున్నారు వైద్య నిపుణులు.
 
పాలకూర, వేరుశెనగకాయలు, పప్పు, బీన్సు, చాక్లెట్లు, కాఫీ, టీలు ఎక్కువగా సేవించకూడదని సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని, ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలంటున్నారు. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్థకం రాదంటున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో చేర్చిచే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కిడ్నీలో రాళ్ళు ఏర్పడవట. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట.