శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (09:07 IST)

ఐఫోన్‌పై మోజు.. తోడు ఆర్థిక ఇబ్బందులు.. అంతే కిడ్నీలు అమ్మేశాడు.. చివరికి?

స్మార్ట్‌ఫోన్లపై వున్న మోజు అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్, ఐఫోన్‌లు లేకుండా రోజు గడవడం ప్రస్తుతం కష్టతరమవుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఐఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరికి ఎక్కడా కదల్లేక మంచానికే పరిమితం అయ్యాడు. చైనా యువకుడు ఈ పని చేసి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే దుస్థితిని కొనితెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు 3,200 డాలర్లకు కిడ్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. చివరకి కిడ్నీ శస్త్రచికిత్స కొద్దిరోజుల తర్వాత వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. 
 
దీంతో వాంగ్ మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది పాటు వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఐఫోన్ మోజు.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా వాంగ్ ఈ చర్యకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు.