శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:08 IST)

అల్పాహారంలో పెరుగుతో ఫ్రూట్స్ స్మూతీ వుంటే..?

అల్పాహారంలో పెరుగుతో కూడిన పండ్ల స్మూతీని భాగం చేసుకుంటే అతి సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక రెండు గంటలకు ఒక కప్పు బొప్పాయి లేదా తర్బూజ ముక్కలు, ఆపిల్‌ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన పెరుగు స్మూతీ తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. 
 
మధ్యాహ్నం ఒక కప్పు బ్రౌన్‌ రైస్‌, ఒక టీస్పూన్‌ నెయ్యి, కూరగాయాలు లేదా గ్రిల్డ్‌ చికెన్‌ లేదా ఫిష్‌ తీసుకోవాలి. అలాగే స్నాక్స్‌ సమయంలో 8 నుంచి పది వేయించిన మఖానాలు లేదా ఐదు వాల్‌నట్స్‌ లేదా ఐదు కిస్మిస్‌లు, లేదా రెండు కోడిగుడ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో వెజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. చికెన్‌ సూప్‌, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్‌, గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్‌ అయితే బీన్స్‌, బ్రొకోలి, పుట్ట గొడుగులు తినాలి.
 
అలాగే ఉదయాన్నే పరగడుపునే అరగ్లాసు అలోవెరా జ్యూస్‌లో పది తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఆ తరువాత రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.